

రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా శంభాలా: ఎ మిస్టికల్ వరల్డ్ ట్రైలర్ విడుదలైంది. హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ మిస్టరీ, సైన్స్, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మొదలవ్వగానే శివుడు-అసురుడు మధ్య యుద్ధం గురించి ఒక కథ వినిపిస్తుంది. ఆ తర్వాత ప్రస్తుత కాలంలోకి వస్తూ, ఒక దూర గ్రామంలో విచిత్ర సంఘటనలు జరుగుతాయి. వీటిని పరిశీలించడానికి ఒక జియో-సైంటిస్టు (ఆది) ఆ గ్రామానికి వస్తాడు. శాస్త్రీయ దృష్టికోణంలో ఉన్న అతడు అద్భుతాల మీద నమ్మకం లేకుండా వస్తాడు కానీ అక్కడ జరిగే సంఘటనలు అతడిని షాక్‌కి గురి చేస్తాయి.
ఆది సాయి కుమార్ కొత్త లుక్‌లో ఇంప్రెస్ చేస్తూ కనిపించాడు. అతని తండ్రి సాయి కుమార్ వాయిస్ ఓవర్ ట్రైలర్‌కి బలం చేకూర్చింది. ఆర్చనా అయ్యర్, స్వసికా, రవి వర్మ, మధునందన్, శివ కార్తిక్ ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకుడు ఉగంధర్ ముని తెరకెక్కించిన ఈ చిత్రంలో విజువల్స్, థ్రిల్లింగ్ సీన్స్, శ్రీచరణ్ పకాలా సంగీతం బాగా నప్పాయి. రాజశేఖర్ అన్నభిమోజు, మహిధర్ రెడ్డి సంయుక్తంగా షైనింగ్ పిక్చర్స్ బేనర్‌పై నిర్మించారు.
శంభాలా సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!