
సినిమాలు

జూ.ఎన్టీఆర్ తన కెరీర్ ప్రారంభంలో శరీరాకృతి గురించి మదనపడేవాడని ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి వెల్లడించారు. చిన్నతనంలో యాక్టింగ్, బాడీ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనే ఆలోచన కూడా చేశాడని తెలిపారు. “నేను లావుగా ఉన్నానా? జనాలు చూస్తారా?” అని ఎన్టీఆర్ అడిగాడని పోసాని గుర్తు చేసుకున్నారు. అయితే అతను ఎన్టీఆర్‌కు ధైర్యం చెప్పి, నువ్వు నీ తాతలా గొప్పగా ఉంటావని భరోసా ఇచ్చినట్లు చెప్పారు.
అలాగే దర్శకుడు ఉదయ్ కుమార్‌తో ఎన్టీఆర్ చేయాలనుకున్న ఓ ప్రాజెక్ట్ కథ తనకు నచ్చలేదని, అదే విషయాన్ని నేరుగా చెప్పడంతో ఆ సినిమా ఆగిపోయిందని వివరించారు. తర్వాత ఎన్టీఆర్ రాజమౌళితో కలిసి ‘సింహాద్రి’ చేశాడని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తనను ఎంతో నమ్మేవాడని పోసాని తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాలను పంచుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!