

యాక్షన్ థ్రిల్లర్ పోలీస్ కంప్లైంట్ తెలుగు, కన్నడ టీజర్ లాంచ్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహారాణా నిర్మించగా, కథ–దర్శకత్వం సంజీవ్ మేగోటి అందించారు. ఎమ్మెస్కె(MSK) ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం హారర్ థ్రిల్లర్, అలాగే పూర్తి ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సౌత్ స్టార్ వరలక్ష్మి శరత్‌కుమార్ పవర్ఫుల్, ఫుల్ ఎంటర్టైనింగ్ రోల్లో కనిపించగా, నవీన్ చంద్ర హీరోయిజంతో నిండిన బలమైన పాత్రలో నటించారు. దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “ప్రేమ, పగ, మంచి–చెడు మధ్య జరిగే హైడ్ అండ్ సీక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. రాగిణి ద్వివేది ప్రత్యేక పాత్రలో థ్రిల్ కలిగిస్తారు. వరలక్ష్మి శరత్‌కుమార్ గారి కట్టుబాటు వల్లే ఈ చిత్రం 45 రోజుల్లో పూర్తి అయింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల అవుతుంది”, అన్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ, “డైరెక్టర్ చెప్పిన కథ చాలా నచ్చింది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్ కామెడీ కూడా చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను”, అన్నారు. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్ మరియు రవితేజ ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వరలక్ష్మి, నవీన్ చంద్ర, రాగిణి పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా ఉంటాయని చిత్ర బృందం తెలిపింది.
ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయికిరణ్, రావుల వెంకటేశ్వరరావు తదితరులు ఈ వేడుకకు హాజరై యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అతిథులు దర్శకుడు సంజీవ్ మేగోటిని ప్రశంసిస్తూ, “ఆయన కథలను బలంగా ప్రజెంట్ చేయగల ప్యాషనేట్ ఫిలిమ్ మేకర్. కథ, స్క్రీన్‌ప్లేలో ప్రత్యేకమైన ఇంటెన్సిటీని చూపిస్తూ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కంటెంట్‌ను సమతుల్యం చేసే ప్రతిభావంతుడు”, అని అన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!