

పెద్ది చిత్రంలోని ‘రై రై రా రా’ లిరికల్ సాంగ్ టాలీవుడ్లో కొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ లిరికల్ వీడియో 46.1 మిలియన్ వ్యూస్ సాధించి, టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన లిరికల్ సాంగ్‌గా నిలిచింది. మాస్ బీట్, ఎనర్జిటిక్ ట్యూన్, అలాగే రామ్ చరణ్ డ్యాన్స్ ఎనర్జీ ఈ రికార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.
అయితే టాప్ లిరికల్ వ్యూస్ జాబితాలో రెండో స్థానంలో కూడా ‘పెద్ది’ చిత్రానికే చెందిన ‘చికిరి చికిరి’ పాట 29.19 మిలియన్ వ్యూస్‌తో నిలవడం విశేషం. మూడో స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోని ‘దేఖ్లేంగే సాలా’ పాట 28.53 మిలియన్ వ్యూస్ సాధించగా, నాలుగో స్థానంలో పుష్ప 2 లోని ‘కిస్సిక్’ పాట 27.19 మిలియన్ వ్యూస్‌తో నిలిచింది. ఐదో స్థానంలో గేమ్ ఛేంజర్ చిత్రంలోని ‘నా నా హైరానా’ పాట 23.44 మిలియన్ వ్యూస్ సాధించగా, ఆరో స్థానంలో ది ప్యారడైజ్ చిత్రంలోని ‘ఆయా షేర్’ పాట 21.74 మిలియన్ వ్యూస్‌తో నిలిచింది. టాలీవుడ్లో ఇప్పుడు లిరికల్ వీడియోలు కూడా సినిమా ప్రమోషన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!