

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ వేగం పెంచుకున్నాయి. చిత్ర బృందం అధికారికంగా రెండో సింగిల్ “ఆరా ఆఫ్ ఉస్తాద్”ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రానికి తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. చంద్రబోస్ రచించిన ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్, ఎస్. పి. అభిషేక్ మరియు ది ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్ ఆలపించడం విశేషం.

విజువల్‌గా ఆకట్టుకునే యానిమేషన్‌తో పాటు పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకమైన స్టైల్ మేనరిజమ్‌ను ప్రోమోలో చూపించడం అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దశరథ్ స్క్రీన్‌ప్లే అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందే “ఆరా ఆఫ్ ఉస్తాద్” అభిమానుల యాంతమ్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!