

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన, ‘కపుల్ ఫ్రెండ్లీ’ ని కూడా గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌తో పాటు ‘నాలో నేను..’, ‘గాబరా గాబరా..’ లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేమ, సంగీతం, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా వాలెంటైన్స్ డేకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!