

ఓటీటీ ప్లాట్‌ఫాంలలో విభిన్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ జానర్‌కు డిజిటల్ ప్రపంచంలో మంచి క్రేజ్ ఉంది. అలాంటి కథతోనే ఇప్పుడు ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో భారీగా ట్రెండ్ అవుతోంది.
ఈ కథలో ఇద్దరు మహిళలు తమ భర్తలతో విసిగి పోతారు. జీవితంలో శాంతి లేకుండా పోవడంతో, వారిని అడ్డు తొలగించుకోవాలనే ప్రమాదకరమైన నిర్ణయానికి వస్తారు. ఒకరి భర్తను మరొకరు చంపాలనే డీల్ కుదుర్చుకుంటారు. ఆ తర్వాత జరిగే పరిణామాలు వారి జీవితాలను పూర్తిగా తలకిందులు చేస్తాయి. ఊహించని మలుపులతో ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.
ప్రతీకారంతో పాటు స్నేహం, ప్రేమ, వంటకాలు వంటి అంశాలను మేళవిస్తూ ఈ కథను ఆసక్తికరంగా రూపొందించారు. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు కర్మా కోర్మా. ఇందులో ప్రముఖ బెంగాలీ నటీమణులు రితాభరి చక్రవర్తి, సోహిణి సర్కార్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు ప్రతీమ్ డి. గుప్తా కర్మ అంటే మన చర్యల ఫలితం అనే భావనను, కోర్మా అనే వంటకంతో చక్కగా ముడిపెట్టారు.
వంటల ద్వారా మొదలైన ఇద్దరు మహిళల పరిచయం క్రమంగా బలమైన స్నేహంగా మారుతుంది. ఆ స్నేహమే ఆపై కోపం, ప్రతీకారం, హత్యలకు దారి తీస్తుంది. భర్తలను చంపేందుకు వంటనే ఆయుధంగా మార్చుకోవాలనే వారి ప్లాన్ కథను మరింత ఆసక్తికరంగా మలుస్తుంది. ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.
మానవ మనస్తత్వం, ప్రతీకారం, కర్మ సిద్ధాంతాన్ని కలిపి రూపొందించిన ఈ సిరీస్ ప్రస్తుతం ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రస్తుతం బెంగాలీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!