

సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక SSMB29 నుంచి మెగా అప్డేట్ వచ్చింది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ భారీ చిత్రానికి టైటిల్, గ్లింప్స్‌ను గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో అధికారికంగా విడుదల చేశారు.
ఎలాంటి టైటిల్ పెడతారో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్న అభిమానులకు మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈవెంట్లో ‘వారణాసి’ అనే టైటిల్‌తో పాటు శక్తివంతమైన గ్లింప్స్‌ను ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
గ్లింప్స్‌లో మహేష్ బాబు చేతిలో త్రిశూలంతో, నంది వాహనంపై తాండవం చేయడానికి సిద్ధమవుతున్న శక్తిమంతమైన లుక్‌లో కనిపించారు. మహేష్ ఈ కొత్త అవతార్ చూసిన అభిమానులు ఉత్సాహంతో కేకలు వేశారు. అతని తీరు, బాడీ లాంగ్వేజ్ స్క్రీన్‌ను కదిలించేలా ఉన్నాయి.
రాజమౌళి వారణాసి అనే పవిత్రమైన నేపథ్యంతో ఎలాంటి కథ చెప్పబోతున్నాడు? అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద కుతూహలం. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!