

హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పపుడిప్పు నిర్మించిన సినిమా ‘నవాబ్ కేఫ్’. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ నెల (ఫిబ్రవరి) 20 న సినిమా విడుదల కానుండగా, ఈ సందర్భంగా చిత్రయూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. మొదట ‘చాయ్ వాలా’ అనే టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమాను సెన్సార్ మార్గదర్శకాలను గౌరవిస్తూ ‘నవాబ్ కేఫ్’ గా మార్చారు.
హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, ఈ సినిమా ఎంతో నిజాయితీతో తీసిన కథ అని చెప్పారు. టైటిల్ మారినా, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నిర్మాతలు ముందుకు వెళ్లారని తెలిపారు. ‘నవాబ్ కేఫ్’ అనే పేరు సినిమాకి ఆత్మలా మారిందని, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ నాన్నకి ఫోన్ చేయాలనిపించేలా కథ ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు సహకరించిన మీడియా, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, సెన్సార్ సూచనలతోనే టైటిల్ మారిందని, చివరకు మొదట అనుకున్న ‘నవాబ్ కేఫ్’ పేరునే ఖరారు చేశామని చెప్పారు. దర్శకుడు ప్రమోద్ హర్ష తన అనుభవాల ఆధారంగా ఈ కథను రాసినట్లు తెలిపారు. హీరోయిన్ తేజు అశ్విని ఇది తన తొలి సినిమా అని, కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!