
రాజకీయాలు

నాని హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’కు యూఎస్‌ఏలో మంచి బజ్ కనిపిస్తోంది. అమెరికాలో ఈ సినిమా విడుదలకు సంబంధించి తొలి విడతగా 150కి పైగా సినీమార్క్ లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో లొకేషన్లలో బుకింగ్స్ ఓపెన్ కావడం నాని ఓవర్సీస్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో అమెరికాలో సినిమా ఓపెనింగ్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఈ చిత్రాన్ని యూఎస్‌ఏలో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర యూఎస్ విడుదల చేస్తోంది. సెప్టెంబర్ 23న అమెరికాలో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో నాని అభిమానుల్లోనూ, ఓవర్సీస్ ప్రేక్షకుల్లోనూ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!