
ఆరోగ్యం

నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నాని పరిచయ గీతం చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో జరుగుతోంది. వందలాది డ్యాన్సర్లతో రూపొందుతున్న ఈ పాటకు అనిరుధ్ సంగీతం అందించగా, సుధన్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
విజయవంతమైన ‘దసరా’ తర్వాత అదే కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం తెలిపింది. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!