

చాలా తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ వరుస విజయాలతో ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. మొదట సాంప్రదాయ లుక్‌తో ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు గ్లామరస్ రోల్లలో కూడా దూసుకెళ్తూ పలు భాషల్లో సినిమాలు చేస్తోంది.
ప్రస్తుతం మృణాల్ తెలుగులో ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తుండగా, హిందీలో కూడా ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఆమె మరో పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు తాజాగా అధికారికంగా ప్రకటించింది.
బాలీవుడ్ ప్రముఖ బ్యానర్లు జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ “దో దివానే షెహర్ మే” (Do Deewane Sheher Mein)లో మృణాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో హీరోగా సిద్ధాంత్ చతుర్వేది కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నారు.
సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భరత్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 14—వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ మృణాల్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేయగా, నెటిజన్లు "సూపర్ జోడీ", “కెమిస్ట్రీ కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!