

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ “మన శంకర వర ప్రసాద్ గారు” కోసం ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినిమా థర్డ్ సింగిల్ “మెగా విక్టరీ మాస్ సాంగ్” ను డిసెంబర్ 30 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రోమోను రేపు రిలీజ్ చేయనుండగా, ఎనర్జీతో నిండిన పోస్టర్లో చిరంజీవి, వెంకటేష్ స్టైలిష్ డాన్స్ పోజ్‌లు కట్టింగ్-ఎడ్జ్ సెలబ్రేషన్ వైబ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టాయి.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతుంది. డెనిమ్ లుక్‌లో చిరంజీవి మెగా స్వాగ్ చూపిస్తే, రెడ్ జాకెట్లో వెంకటేష్ స్టన్నింగ్ గా కనిపిస్తున్నారు. ఈ సాంగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పర్ఫెక్ట్ మాస్ ఆంథమ్‌గా వర్క్ అవుతుంది. “మన శంకర వర ప్రసాద్ గారు” జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!