

ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’ (తెలుగులో అమరకావ్యం) త్వరలో ఓటీటీలోకి రానుంది. గతేడాది నవంబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే డిజిటల్ రిలీజ్‌కు ముందు ఈ చిత్రానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
ఈ సినిమా తమ హిట్ మూవీ ‘రాంఝనా’కు సీక్వెల్ అంటూ ప్రచారం చేశారని, అందుకు తమ అనుమతి తీసుకోలేదని ఆరోపిస్తూ ఇరోస్ ఇంటర్నేషనల్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. నిర్మాణ సంస్థ కలర్ ఎల్లో, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ రూ.84 కోట్ల నష్టపరిహారం కోరింది. రాంఝనాలోని కొన్ని పాత్రలు తేరే ఇష్క్ మేలో కొనసాగాయని సంస్థ ఆరోపించింది. గమనార్హంగా, 2013 లో విడుదలైన రాంఝనా కూడా ధనుష్–ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం కాగా, గతేడాది రీ-రిలీజ్ సమయంలో ఎండింగ్ మార్పుపై వివాదం చెలరేగింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!