

రాజకీయ ప్రవేశానికి ముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన "జన నాయకుడు" జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే చిత్ర బృందం మొదటి సింగిల్‌ను విడుదల చేసింది. ఆ వీడియో చూస్తే ఇది భగవంత్ కేసరి రీమేక్‌నే అనిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. ట్రైలర్ వచ్చిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని టెక్నికల్ వర్క్స్ పూర్తయిన తర్వాత విజయ్ తన డబ్బింగ్ చెబుతారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెట్టిందని సమాచారం. అయితే ఈ మూవీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఫ్యాన్స్‌లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి.
ముందుగా హ్యాపీ విషయం చూస్తే, ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సుమారు ₹110 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెన్నై టాక్. ఓవర్సీస్ హక్కులు ₹80 కోట్లు, మ్యూజిక్ రైట్స్ ₹35 కోట్లు, ఇతర భాషలు, రాష్ట్రాల ద్వారా మరో ₹55 కోట్లు రావొచ్చని అంచనా. కేవలం తమిళనాడు థియేట్రికల్ రైట్స్ నుంచే ₹100 కోట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా ఈ డీల్స్ అన్నీ జరిగితే ₹400 కోట్ల భారీ బిజినెస్ సాధ్యమవుతుంది.
ఇక బీపీ విషయం చూస్తే, నిర్మాత ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి మాత్రమే థియేట్రికల్ హక్కులు అమ్మాలని చూస్తుండగా, కొలీవుడ్ టాక్ ప్రకారం పంపిణీదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
రాజకీయ వాతావరణం సున్నితంగా ఉండటంతో, ఏదైనా పార్టీ లేదా వ్యతిరేక శక్తులు అడ్డంకులు సృష్టిస్తే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పైగా సినిమాలో రాజకీయ విమర్శలు ఉన్నాయని టాక్. అవి ఏవైనా వ్యక్తులను నేరుగా టార్గెట్ చేసినట్లయితే కాంట్రావర్సీలు తప్పవు. అందుకే డిస్ట్రిబ్యూటర్లు జాగ్రత్తగా ఒక్కో ఏరియాల వారీగా హక్కులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
ఈ చర్చలన్నీ క్లియర్ కావడానికి ఇంకా ఒక నెల రోజుల సమయం పట్టవచ్చు. ఇక అభిమానులతో కనెక్ట్ కావడానికి విజయ్ ఒక గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నప్పటికీ, ఈసారి అనుమతులు పొందడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!