

హైదరాబాద్ నగరం మౌలిక వసతులు, సాంకేతికతతో పాటు వినోద రంగంలో కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరంలో మల్టీప్లెక్స్ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తుండగా, ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ సొంత థియేటర్లను ప్రారంభించారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహేష్ బాబు AMB సినిమాస్, అల్లు అర్జున్ AAA సినిమాస్, రవితేజ ART సినిమాస్‌ను ప్రారంభించారు. త్వరలో వెంకటేష్ మరియు మహేష్ బాబు AMB క్లాసిక్‌ను తీసుకురానుండగా, అల్లు కుటుంబం మరో మల్టీప్లెక్స్‌ను ప్లాన్ చేస్తోంది.
ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా చేరుతున్నారు. ఆయన మల్టీప్లెక్స్ చైన్ Devgn CineX హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. కర్మన్‌ఘాట్‌లోని కొలీసియం మాల్లో ఏర్పాటు కానున్న ఈ ఏడు స్క్రీన్ ల లగ్జరీ మల్టీప్లెక్స్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందుగా NY సినిమాస్‌గా ఉన్న ఈ బ్రాండ్‌ను Devgn CineX గా రీబ్రాండ్ చేశారు. ఆధునిక సాంకేతికతతో పాటు క్లాసిక్ సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా, దేశవ్యాప్తంగా 250 స్క్రీన్లకు విస్తరించాలని అజయ్ దేవగన్ యోచిస్తున్నారు.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!