

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రం నుంచి హీరోయిన్ లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన పోస్టర్లో ప్రియా భవానీ శంకర్ కావేరి పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకుంది. రవితేజ రగ్గడ్ లుక్‌లో ఆమె చెంపపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించిన పోస్టర్ ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగాన్ని చూపిస్తోంది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇంటెన్స్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథగా రూపొందుతోంది. ముఖ్యంగా తండ్రి కూతురు అనుబంధం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రవితేజ గత చిత్రాలకంటే భిన్నంగా కొత్త ఎమోషనల్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండగా, పలు కీలక పాత్రలతో సినిమా మరింత బలంగా నిలవనుంది. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!