

జనవరి 7 న తెలుగు చిత్ర పరిశ్రమకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ వ్యక్తి బీఏ రాజు 66 వ జయంతి. దాదాపు 40 ఏళ్ల పాటు జర్నలిస్ట్‌గా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా, ప్రచురణకర్తగా, నిర్మాతగా అనేక బాధ్యతలు నిర్వహించిన ఆయన, నిజానికి ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ. పరిశ్రమలో అగ్ర తారల నుంచి కొత్తగా వచ్చిన నటీనటుల వరకు అందరినీ సమానంగా గౌరవించి ప్రేమతో మెలగడం ఆయన ప్రత్యేకత.
సూపర్‌స్టార్ కృష్ణ చిత్రాల ప్రచారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన బీఏ రాజు, అనంతరం 1,500 కి పైగా సినిమాలకు పబ్లిసిటీ ఇన్చార్జ్గా వ్యవహరించారు. 1994 లో భార్య బి జయతో కలిసి సూపర్ హిట్ వీక్లీ మ్యాగజైన్‌ను ప్రారంభించి, చివరి శ్వాస వరకు ఒక్క సంచిక కూడా మిస్ కాకుండా 27 సంవత్సరాలు నడిపించారు. అనంతరం సూపర్‌హిట్ ఫ్రెండ్స్, ఆర్జే సినిమాస్ బ్యానర్లపై ప్రేమలో పవని కళ్యాణ్, చంటిగాడు, లవ్లీ, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. పరిశ్రమకు ‘నాలెడ్జ్ బ్యాంక్’గా పేరొందిన ఆయన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జర్నలిస్టుల సంక్షేమానికి అండగా నిలిచారు. "ఇండస్ట్రీహిట్ డాట్‌కామ్"తో(Portal) పాటు ఆయన కుమారుడు శివకుమార్ బి ద్వారా బీఏ రాజు వారసత్వం నిరంతరం కొనసాగుతోంది. బీఏ రాజు మన మధ్య లేకపోయినా, ఆయన చేసిన సేవలు, జ్ఞాపకాలు పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోతాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!