

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరియు బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం అఖండ 2: ది తాండవం అన్ని అడ్డంకులను అధిగమించి డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
సింహా, లెజెండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత బాలకృష్ణ–బోయపాటి శ్రీను నాలుగోసారి కలవడం సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లు అందుకున్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ప్రమోషనల్ వీడియో, పోస్టర్ సినిమాపై మరింత బజ్ పెంచుతోంది.
సనాతన హైందవ ధర్మం నేపథ్యంగా ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్‌తో అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు హృదయాన్ని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ఈ చిత్రంలోని ప్రధాన బలం కానుంది. బాలకృష్ణ మూడు విభిన్న గెటప్‌లలో కనిపించనుండగా, థమన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు శక్తినిస్తుంది. సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!