
సినిమాలు

టాలీవుడ్‌లో తన నటన, నృత్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల మరోసారి తన సున్నిత మనసుతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఓ అవార్డు కార్యక్రమంలో శ్రీలీల దగ్గరకు వచ్చిన చిన్నారి అభిమాని ఆమెకు గులాబీ పువ్వు అందించింది. వెంటనే కిందకు వంగి కూర్చొని ఎంతో ప్రేమగా ఆ పువ్వును స్వీకరించిన శ్రీలీల, చిన్నారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి ఫోటో కూడా దిగారు. ప్రస్తుతం ఈ అందమైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా, శ్రీలీల మరియు యువ క్రికెటర్ తిలక్ వర్మ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. గత ఏడాది నుంచి ఇద్దరూ రహస్యంగా కలుస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని శ్రీలీల బృందం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ ఈ ప్రచారం మాత్రం సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతూనే ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!