

'నేను సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయ్యాయంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ 50 ఏళ్లు కేవలం, పదీ, పదిహేను ఏళ్లలా గడిచిపోయాయి. సినిమా అంటే నాకున్న విపరీతమైన ప్రేమ వల్లే సమయం ఇంత వేగంగా గడిచిపోయిందేమో. నాకు మరో వంద జన్మలు ఉన్నా మళ్లీ రజనీకాంత్ (Rajinikanth) గానే పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను' అని హీరో రజనీకాంత్ అన్నారు. 58వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ Iffi) ముగింపు వేడుకలు నవంబర్ 28వ తేదీ రాత్రి గోవా (Goa) లో అట్టహాసంగా జరిగాయి. భారతీయ సినిమాకు 50 ఏళ్లుగా అసమాన సేవలు అందిస్తున్న రజనీకాంత్ ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Savanth) రజనీకాంత్ కు శాలువా కప్పి, ప్రత్యేక జ్ఞాపికను అందించి గౌరవించారు. సన్మానం అనంతరం వేదికపై బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రజనీకాంత్ చేతిని ముద్దాడారు.
ఇఫీలో మహిళా దర్శకులు రూపొందించిన 50 చిత్రాలను ప్రదర్శించారు. వేవ్స్ ఫిల్మ్ బజార్ వేదికగా ఇఫీలో వేయి కోట్ల బిజినెస్ జరిగిందని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. ఇఫీ పురస్కారాల విజేతల జాబితాను ప్రకటించి, అవార్డులను అందజేశారు. వియత్నాంకు చెందిన 'స్కిన్ ఆఫ్ యూత్' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికై ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ నటుడి పురస్కారం ఉపయమార్ రియోస్ (స్పానిష్ చిత్రం- ఏ పోయెట్)కు దక్కింది. ఉత్తమ నటిగా 'జరా సోఫియా ఓస్థాన్ (స్లొవేనియన్ వల్స్ లిటిల్ ట్రబుల్ గర్ల్స్), ఉత్తమ దర్శకుడుగా సంతోష్ దవాఖర్ (మరాఠీ చిత్రం - గోందాల్) ఎంపికయ్యారు. ఉత్తమ భారతీయ తొలి చిత్ర దర్శకుడి పురస్కారం కరణ్ సింగ్ త్యాగి (కేసరి: ఛాప్టర్ 2)ని వరించింది. హిందీ సిరీస్ బందీశ్ బాండిట్స్ 2 ఉత్తమ వెబ్ సీరీస్ గా నిలిచింది.


_1771477764226.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!