
జనరల్

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌పై నటుడు ధనుష్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘రాఫా’ డాక్యుమెంటరీ చూసిన తర్వాత తాను భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. నాదల్ కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాలను ఇప్పుడు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు.
మ్యాచ్‌ల సమయంలో నాదల్‌ను తాను తప్పుగా విమర్శించినందుకు ఇప్పుడు బాధగా ఉందని ధనుష్ అన్నారు. శారీరక నొప్పి, మానసిక ఒత్తిడిని తట్టుకుని ఆయన ఆడిన తీరు స్ఫూర్తిదాయకమని తెలిపారు. నాదల్‌ను ఒక్క మాటలో చెప్పాలంటే ‘గోట్’ అని అభివర్ణించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!