

ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న “సమ్మర్ హాలిడేస్” చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బాలనటి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథా ప్రధాన చిత్రాలను అందిస్తూ నిర్మాతగా, పంపిణీదారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ రోజు బాలనటి ఖుషి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటించి ఖుషి మంచి ప్రశంసలు అందుకుంది. “సమ్మర్ హాలిడేస్” చిత్రం ఆమెకు మరింత గుర్తింపు తీసుకురానుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. త్వరలో ఈ చిత్రం ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!