

మాస్ మహారాజా రవితేజ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలై ఆసక్తిని మరింత పెంచింది.
ట్రైలర్లో రవితేజ ఫ్యామిలీ జోన్‌కు తిరిగి వచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. భార్య, మరో మహిళ మధ్య చిక్కుకున్న కథా సంఘర్షణ హాస్యం, భావోద్వేగాలతో సాగుతుంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సత్య, సునీల్, వెన్నెల కిషోర్ పాత్రలు నవ్వులు పంచుతాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్సాహభరితమైన సంగీతం, ఉన్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు తప్పక చూడదగిన వినోదంగా నిలవనుంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!