
గాసిప్స్

హైదరాబాదీ సంస్కృతి, ఫోక్ ఎనర్జీతో రూపొందిన చిత్రం ‘అమీర్ లోగ్’ నుంచి ఫుల్ లిరికల్ సాంగ్ ‘అవ్వల్ దావత్’ విడుదలైంది. ఈ పాటను ప్రముఖ ఫోక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా, స్మరణ్ సాయి సంగీతం అందించారు. చార్మినార్ నేపథ్యంలో సెట్ చేసిన ఈ పాటలో ఉత్సాహభరితమైన డాన్స్ మూమెంట్స్, పండుగ వాతావరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమా దర్శకత్వం వహించగా, అనీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరింత జోష్ అందించింది. హైదరాబాదీ మాస్ కల్చర్‌ను ప్రతిబింబించేలా రూపొందిన ‘అవ్వల్ దావత్’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి స్పందనను పొందుతోంది. ఫోక్ టచ్, ఎనర్జిటిక్ విజువల్స్‌తో ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!