

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్స్ జంటగా నటిస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా, మొదటి అనౌన్స్మెంట్ గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్న వీడియోలో కనిపించిన లుక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్టైలింగ్ అన్ని కలిసి సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేశాయి. తరువాత విడుదలైన ప్రతి అప్డేట్ పోస్టర్, టీజర్, చిన్న ప్రమో వెంటనే వైరల్ కావడం చూస్తే, ఈ సినిమాకు ఎంతటి రెస్పాన్స్ ఉందో అర్థమవుతుంది. ప్రమోషనల్ స్ట్రాటజీ విషయంలో, ఇది రామ్ కెరీర్లోనే అత్యుత్తమంగా భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దర్శకత్వాన్ని మహేష్ బాబు పి అందిస్తున్నారు. కథ కాన్సెప్ట్ కూడా కొత్తదే “ఒక ఫ్యాన్ బయోపిక్” అనే థీమ్‌తో సినిమా రావడం చాలా అరుదు. సినిమాలో రామ్ ఒక ప్రభావవంతమైన హీరోకు పిచ్చి అభిమానిగా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు చూసిన ఫుటేజ్ ప్రకారం, ఇది రామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రామ్ పాత్రలో కనిపించిన భావోద్వేగం, పిచ్చి, ఆరాధన అన్నీ కలగలిపి ప్రత్యేకంగా నిలవనున్నాయట.
సినిమాపై ఈ హైప్‌ను దృష్టిలో పెట్టుకుని, చిత్రబృందం విడుదల తేదీని ఒక రోజు ముందుకు జరిపి నవంబర్ 27కి ఫిక్స్ చేసింది. అభిమానులకు ముందుగానే ట్రీట్ ఇవ్వాలన్నదే కారణమని టీమ్ చెబుతోంది. అంతేకాకుండా, సినిమా ట్రైలర్‌ను నవంబర్ 18న కర్నూలులో భారీ జనసందోహం మధ్య విడుదల చేయనున్నారు. మరో ముఖ్యమైన ఆకర్షణ, స్టార్ నటుడు ఉపేంద్ర కీలక పాత్ర పోషించడం. అతని పాత్ర సినిమా ఇంపాక్ట్‌ని ఇంకా పెంచుతుందని టాక్. ట్రేడ్ వర్గాలు మాత్రం ఒకే మాట చెబుతున్నాయి ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ కెరీర్లో భారీ బ్లాక్‌బస్టర్ అయ్యే సినిమాగా కనిపిస్తోంది.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!