
.jpg&w=3840&q=75)
ఈ సంక్రాంతిని నవ్వుల పండుగగా మార్చేందుకు స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే అద్భుతమైన స్పందనను అందుకుంది. నాన్‌స్టాప్ కామెడీతో పాటు చివర్లో భావోద్వేగాన్ని మేళవించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపింది.
సినిమాకు వస్తున్న బ్లాక్‌బస్టర్ టాక్ నేపథ్యంలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచే అద్భుతమైన స్పందన లభించిందని చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులు సినిమా మొత్తం నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారని, క్లైమాక్స్‌లో ఎమోషన్ కూడా బాగా వర్క్ అవుతోందని తెలిపారు. తొలి షో నుంచే ఇంతటి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తాను పోషించిన పాత్రకు వస్తున్న ప్రశంసలు ఆనందాన్ని ఇస్తున్నాయని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, మొదటి నుంచే ఈ సినిమాపై నమ్మకం ఉండేదని, ప్రేక్షకులు ఆ నమ్మకాన్ని నిజం చేశారని అన్నారు. రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!