

ప్రస్తుతం హారర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఉత్కంఠభరిత కథతో రూపొందుతున్న చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అశోక్ కుమార్, భద్రం, జెమిని సురేష్ కీలక పాత్రలు పోషించారు. జీవికె దర్శకత్వంలో, ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
క్రిస్మస్ సందర్భంగా విడుదలైన కొత్త పోస్టర్, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. వీఎఫ్ఎక్స్ పనులు వేగంగా జరుగుతున్నాయని హీరో శివ కంఠంనేని తెలిపారు. సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా ఈ సినిమా రూపొందిందని దర్శకుడు జీవికె చెప్పారు. త్వరలోనే ప్రమోషన్లు ప్రారంభించి, థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!