

రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా మార్చి 27న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడినట్లు దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కొత్త విడుదల తేదీగా మే 1పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఆలోపు చిత్ర నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉండటంతో పాటు, ప్రమోషన్లకు సరిపడ సమయం దొరుకుతుందనే అంచనాతో ఈ తేదీని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. అఖిల్ అక్కినేని నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ఇప్పటికే మే 1 రిలీజ్‌గా లాక్ అయింది. ‘ఏజెంట్’ ఫ్లాప్ తర్వాత అఖిల్‌కు ఇది కెరీర్‌కు కీలకమైన సినిమా కావడంతో, ఈ తేదీపై టీమ్ గట్టిగానే ఉంది. రామ్‌చరణ్, అఖిల్ మంచి స్నేహితులు కావడంతో ఒకే రోజు బాక్సాఫీస్ క్లాష్ జరిగే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దీంతో చివరకు ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎవరి నిర్మాణ సంస్థ ఎవ్వరిని ఒప్పిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!