
టెక్నాలజీ

తమిళ సినీ చరిత్రలో సంచలనం సృష్టించేలా కమల్ హాసన్ మరియు రజినీకాంత్ కలిసి నటిస్తున్న KHxRK చిత్ర టీజర్ పోస్టర్‌ను రెడ్ జెయింట్ మూవీస్ విడుదల చేసింది. “కొందరు రూల్స్ సెట్ చేస్తారు.. కొందరు తామే రూల్ చేస్తారు” అనే పవర్ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్లో మెర్సిడెస్ కారు, ‘KHxRK’ టైటిల్‌తో పాటు ఫిబ్రవరి 21, 2026 తేదీని ప్రదర్శించడం విశేషంగా నిలిచింది.
ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. భారతీయ సినీ రంగంలో ఇద్దరు దిగ్గజ నటులు ఒకే సినిమాలో కనిపించనున్న నేపథ్యంలో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను రేపు మధ్యాహ్నం 12:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!