

గుండె జబ్బులను తరచుగా ‘నిశ్శబ్ద కిల్లర్’గా పిలుస్తారని వైద్యులు అంటున్నారు. ఛాతీ నొప్పి వంటి స్పష్టమైన లక్షణాలు కనిపించేలోపే వ్యాధి ముదిరే అవకాశం ఉంటుంది. అయితే గుండె ఆరోగ్యానికి సంబంధించిన మొదటి హెచ్చరికలు చర్మంపై కనిపించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పాదాలు, కాళ్లలో వాపు, చర్మం రంగు నీలం లేదా ఊదాగా మారడం, చేతులు–కాళ్లు తరచూ చల్లగా ఉండటం వంటి లక్షణాలు రక్త ప్రసరణలో సమస్యలను సూచించవచ్చు.
అలాగే చర్మంపై పసుపు-నారింజ రంగు మైనపు మచ్చలు (జాంతోమాస్), ఎరుపు-పసుపు మచ్చలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్ స్థాయిలకు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి చర్మంపై కనిపించే చిన్న మార్పులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!