

నేటి వేగవంతమైన జీవితంలో ఫిట్‌గా ఉండటం చాలా మందికి సవాల్‌గా మారింది. జిమ్‌లకు వెళ్లడం లేదా కఠినమైన డైట్‌లు పాటించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా అందరూ సులభంగా చేయగలిగే ఉత్తమ వ్యాయామం నడక. రోజుకు కనీసం ఒక కిలోమీటరు నడవడం ద్వారా కూడా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక కిలోమీటరు నడిస్తే 60 నుంచి 100 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. వేగంగా నడిస్తే మరింత క్యాలరీలు కరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మానసిక ఒత్తిడిని తగ్గించే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. రోజువారీ వాకింగ్ మంచి నిద్రకు దోహదపడుతూ ఇన్సోమ్నియాను తగ్గిస్తుంది. సరైన ఆహారంతో పాటు నడకను అలవాటు చేసుకుంటే బరువు తగ్గడంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. కేవలం ఒక కిలోమీటరు నడక చిన్న లక్ష్యంలా అనిపించినా, దాన్ని ప్రతిరోజూ పాటిస్తే ఆరోగ్యానికి పెద్ద మార్పును తీసుకువస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!