

మారుతున్న లైఫ్‌స్టైల్ మరియు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో తలనొప్పి కూడా ఒకటి. కొంతమంది ఉదయం నిద్ర లేవగానే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలా తలనొప్పి ఎందుకు వస్తుందో చాలామందికి తెలియదు.
కాబట్టి మార్నింగ్ తలనొప్పికి కారణాలు, దానికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు కూడా ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతుంటే, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే నిద్ర మరియు తలనొప్పి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.
సాధారణంగా నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి వస్తుందని అందరికీ తెలుసు. కానీ అధిక నిద్ర వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. అంతేకాక, అధిక పని ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం, ఒత్తిడి జీవనశైలి కూడా తలనొప్పికి కారణమవుతాయి.
శరీరానికి అవసరమైన నిద్ర లేకపోవడం మెదడు కణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనపడటమే కాకుండా, ఆలోచించే మరియు అర్థం చేసుకునే సామర్థ్యాలు కూడా తగ్గుతాయి. దీని ఫలితంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఈ సమస్యను అధిగమించేందుకు రోజంతా పుష్కలంగా నీరు త్రాగండి. ఉదయం నిద్రలేవగానే ఒక పెద్ద గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోండి. అలాగే, పౌష్టికాహారం తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం కూడా చాలా ముఖ్యం. ఇది తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
రోజుకు కనీసం 7 నుండి 8 గంటలపాటు నిద్రపోవడానికి ప్రయత్నించండి.
ఈ చిన్న మార్పులను మీ రోజువారీ జీవితంలో పాటిస్తే, కచ్చితంగా మార్పు గమనిస్తారు.
అయినా తలనొప్పి తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.











కామెంట్స్ (2)
ప్రయోజనకరం
మంచి నిద్ర, సరైన ఆహారం చాలా ముఖ్యం