
ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవడానికి బెస్ట్ టిప్స్ ఇవే!
ఎలాంటి టెన్షన్, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఆనందంగా నిద్రపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే హాయిగా నిద్రపోతారు. చాలా మంది రాత్రి సమయంలో అతి ఆలోచనలతో ఎక్కువగా నిద్రపోవడానికి ఆసక్తి చూపరు. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవసరం. నిద్ర సరిగా లేకపోతే శరీరానికి అనేక అనారోగ్య సమస్యలు రావచ్చు. అయితే త్వరగా, ప్రశాంతంగా నిద్రపోవాలంటే కొన్ని టిప్స్ తప్పనిసరిగా పాటించాలి.
పడుకునే ముందు అతి ఆలోచనలను మానుకోండి
చాలా మంది రాత్రి పడుకునే సమయంలో తమ జీవితంలోని సమస్యలను, సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇది చేయకూడదు. పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. మీ జీవితంలోని సంతోష క్షణాలను తలచుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇది మీ మనసుకు ప్రశాంతతనూ, శరీరానికి హాయినీ ఇస్తుంది.
రాత్రివేళల్లో ఫోన్ దూరంగా ఉంచండి
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం లేవగానే మొదలై రాత్రి పడుకునే వరకు చాలామంది ఫోన్లోనే గడుపుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం ఆరోగ్యానికి హానికరం. స్క్రీన్ లైట్ వల్ల నిద్రలేమి (Insomnia) సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పడుకునే ముందు కనీసం 30 నిమిషాల ముందు ఫోన్ వాడకం ఆపండి.
రాత్రి ఆహారంపై జాగ్రత్తలు తీసుకోండి
త్వరగా నిద్రపట్టాలంటే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకుండా, రాత్రి 8 గంటలలోపే తినేయడం మంచిది. పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగితే నిద్ర సులభంగా పట్టే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.
గది వాతావరణం సౌకర్యంగా ఉంచండి
బెడ్రూమ్లో ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, ఎందుకంటే ఇది నిద్రను భంగం చేస్తుంది. కర్టెన్స్ ఉపయోగించి వెలుతురు లోపలికి రాకుండా చూసుకోండి. అలాగే బెడ్రూమ్లో TV ఉండనివ్వకండి, ఎందుకంటే ఇది కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
మొత్తానికి, టెన్షన్ లేకుండా, మనసును ప్రశాంతంగా ఉంచి, సరైన ఆహారం తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. మంచి నిద్రే మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు!











కామెంట్స్ (1)
very informative