

తిన్న తర్వాత గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు మీకూ ఇబ్బంది పెడుతున్నాయా? ఇవన్నీ జీర్ణవ్యవస్థ సరిగా పని చేయకపోవడం, డైజెస్టివ్ ఎంజైమ్స్ సరైనంగా విడుదల కాకపోవడం వల్ల ఉంటాయి.
కానీ, ఇప్పుడు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడే ఓ సులభమైన నియమాన్ని న్యూట్రిషనిస్ట్ అమీషా షేర్ చేస్తున్నారు. అదే ‘30-30-3 రూల్’. మీ గట్ హెల్త్ ను రీబూట్ చేయడానికి ఈ సింపుల్ రూల్ ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.
గట్ హెల్త్ ఎందుకు ముఖ్యం?
"అన్ని రోగాల మూలం పొట్టలోనే ఉంటుంది" అనేది నిపుణుల మాట. జీర్ణవ్యవస్థ బలంగా ఉంటే, ఆరోగ్యం స్వయంగా బాగుంటుంది. ఇది బాలెన్స్ కాకపోతే, కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. మలబద్ధకం వల్ల శరీరంలో టాక్సిన్స్ జమ అవుతాయి, ఇవి తర్వాత ఇతర రోగాలకు దారి తీస్తాయి.
అద్భుత నియమం: ఏంటీ ఈ 30-30-3 రూల్?
అనేక హెల్త్ ట్రెండ్స్ మధ్య, ఈ 30-30-3 రూల్ దాని సరళత మరియు ప్రభావవంతంగా పని చేసే స్వభావం వల్ల చాలా ప్రాచుర్యం పొందుతోంది. ఇది మీ రోజువారీ ఆహారంలో అనుసరించాల్సిన ఒక సైంటిఫిక్ ఫార్ములా.
మొదటి 30 (ప్రొటీన్): మీ రోజు మొదటి భోజనంలో 30 గ్రాముల ప్రొటీన్ ఉండేలా చూసుకోండి. ప్రొటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ మీ మెటబాలిజాన్ని సక్రియం చేసి, రోజంతా శక్తినిస్తుంది. ఇది జీర్ణశక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
రెండవ 30 (ఫైబర్): రోజంతా కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోండి. ఫైబర్ జీర్ణక్రియకు ఇంధనం లాంటిది. ఇది మలాన్ని మెత్తగా చేసి, సmooth గా మలవిసర్జన చేయడానికి సహాయపడుతుంది. పప్పుధాన్యాలు, ఓట్స్, కూరగాయలు, పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.
చివరి 3 (ప్రొబయాటిక్స్): మీ రోజువారీ ఆహారంలో 3 రకాల ప్రొబయాటిక్ సోర్సెస్‌ను చేర్చండి. ప్రొబయాటిక్స్ మీ పొట్టలోని "మంచి బ్యాక్టీరియాలు". ఇవి ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలు శోషణం కావడానికి మరియు చెడు బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
ప్రొబయాటిక్స్ కోసం ఇవి తినండి:
పెరుగు: లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాతో కూడిన సూపర్ ఫుడ్.
ఊరగాయలు: ఇంట్లో తయారు చేసుకున్న ఊరగాయలు, కిమ్చి.
పండ్ల రసాలు: క్యారెట్, ఆపిల్, దానిమ్మ, పుచ్చకాయల రసాలు.
ముగింపు: 30-30-3 రూల్ ఓ డైట్ ప్లాన్ కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలి. రోజు మొదటి భోజనంలో 30గ్రా. ప్రొటీన్, రోజంతా 30గ్రా. ఫైబర్, మరియు 3 రకాల ప్రొబయాటిక్స్ తీసుకోవడం ద్వారా మీ జీర్ణవ్యవస్థను మీరే బలోపేతం చేసుకోవచ్చు. ఆరోగ్యవంతమైన జీర్ణశక్తికి ఈ రూల్ ను ఈ రోజే ప్రారంభించండి!
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త డైట్ ప్లాన్‌ను ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా న్యూట్రిషనిస్ట్ తో సంప్రదించండి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!