

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాలు, ఇంటి పనుల మధ్య సమతుల్యం సాధించడం కష్టమవుతున్న నేపథ్యంలో పిల్లలకు త్వరగా, ఆరోగ్యంగా బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడం అవసరమని వైద్యులు, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం శరీరానికి ప్రోటీన్, ఫైబర్, శక్తినిచ్చే ఆహారం అందితే రోజు అంతా యాక్టివ్‌గా ఉంటారని వారు చెబుతున్నారు. అందుకే తక్కువ సమయంలో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లను నిపుణులు సూచిస్తున్నారు.
స్ప్రౌట్స్ చాట్:
మొలకెత్తిన శనగలు, పెసలు, పల్లీలు ప్రోటీన్‌తో పాటు ఫైబర్‌ను అందిస్తాయి. వీటిలో ఉల్లి, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి నిమ్మరసం చల్లి తగినంత ఉప్పు, కారం వేసుకుంటే చాలు. వండాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో రెడీ అవుతుంది. పిల్లలకు శక్తినిచ్చే మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా వైద్యులు సూచిస్తున్నారు.

రవ్వ దోశ:
ఉప్మా రవ్వ, బియ్యప్పిండి, పెరుగు కలిపి చేసిన రవ్వ దోశ త్వరగా తయారవుతుంది. ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర కలిపితే రుచి పెరుగుతుంది. ఇది పొట్ట నిండుగా ఉంచి ఎక్కువసేపు ఆకలి లేకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వెజిటేబుల్ ఆమ్లెట్ (బెసన్ చిల్లా):
శనగపిండి, బియ్యప్పిండి, టొమాటో, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికం వంటి కూరగాయలతో తయారయ్యే ఈ అమ్లెట్ ప్రోటీన్, విటమిన్లతో నిండి ఉంటుంది. తక్కువ నూనెతో పెనంపై కాల్చుకుంటే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది. ఇది పిల్లల ఎదుగుదలకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!