

ఆరోగ్యానికి నడక ఎంతో అవసరమైనప్పటికీ, రోజుకు తప్పనిసరిగా 10,000 అడుగులు నడవాలనే నియమానికి ఎటువంటి బలమైన వైద్య ఆధారం లేదని ఆర్థోపెడిక్ నిపుణులు చెబుతున్నారు. ఈ లక్ష్యం మొదట మార్కెటింగ్ వ్యూహంగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా వయసు పైబడిన వారు లేదా అధిక బరువు ఉన్నవారు బలవంతంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తే మోకాళ్లపై అధిక ఒత్తిడి పడే ప్రమాదం ఉంది.
అత్యధికంగా లేదా తప్పు విధానంలో నడవడం వల్ల మోకాళ్ల నొప్పి, వాపు, కీళ్లలో శబ్దాలు వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల అడుగుల సంఖ్యకన్నా సరైన పద్ధతిలో నడవడం ముఖ్యం. రోజుకు 7,000 నుంచి 8,000 అడుగులు నడవడం సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తేలికపాటి వ్యాయామాలు చేయడం, మంచి షూస్ ధరించడం, సమాంతర ప్రదేశాల్లో నడవడం ద్వారా కీళ్లను రక్షించుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!