

పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఎంజైమ్‌లు శరీరానికి పలు విధాల ప్రయోజనం అందిస్తాయి. అయితే, ఆరోగ్య నిపుణుల ప్రకారం కొంతమందికి ఈ పండు విషంతో సమానంగా పనిచేసే అవకాశం ఉంది.
దీనిలో ఉన్న బ్రోమెలైన్ ఎంజైమ్, అలాగే బలమైన ఆమ్లత్వం కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. కాబట్టి, ఈ పరిస్థితుల్లో ఉన్నవారు పైనాపిల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.
పైనాపిల్ తింటే వికారం, వాంతులు, దురద, చర్మం ఎర్రబడటం వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు.
పైనాపిల్‌లో సహజ చక్కెర (నేచురల్ షుగర్) ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అకస్మాత్తుగా పెంచే ప్రమాదం ఉంది.
పైనాపిల్ ఆమ్లత్వం (acidity) అధికంగా ఉంటుంది. దీంతో గుండెల్లో మంట, ఆమ్ల రిఫ్లక్స్ వంటి సమస్యలు మరింత పెరుగుతాయి.
బ్రోమెలైన్ ఎంజైమ్ వల్ల కొందరిలో కడుపు నొప్పి, వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి.
కీమోథెరపీ మందులు, కొన్ని యాంటిడిప్రెసెంట్లు, రక్తం సన్నబెట్టే మందులు వాడుతున్నవారికి పైనాపిల్ ప్రతికూల ప్రభావం చూపుతుంది.
బ్రోమెలైన్ వల్ల మందుల ప్రభావం అధికంగా మారే ప్రమాదం ఉంటుంది.
పైనాపిల్‌లో ఉన్న ఆమ్లత్వం దంతపు ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. దీంతో దంత నొప్పి, చేదు, సున్నితత్వం పెరిగే అవకాశం ఉంది.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!