

న్యూ ఇయర్ పార్టీల్లో రాత్రి ఎక్కువ మద్యం సేవించి తర్వాత హ్యాంగోవర్‌తో బాధపడుతున్నారా? అలాంటి సందర్భాల్లో సహజ డీటాక్స్ డ్రింక్స్ చాలా ఉపయోగకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి శరీరంలోని విషాన్ని బయటకు పంపి, మిమ్మల్ని త్వరగా ఉత్సాహంగా ఉంచతాయని సూచిస్తున్నారు.
మద్యం సేవించడం శరీరంలో డీహైడ్రేషన్‌ను (నీరు తగ్గడం) కలిగిస్తుంది, దాంతో తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి సమస్యలు మొదలవుతాయి. డాక్టర్ల సూచన ప్రకారం, మద్యం సేవించిన తర్వాత నీరు ఎక్కువగా తాగడం, అలాగే ఎలక్ట్రోలైట్స్ (ఉప్పు, పొటాషియం) కలిగిన నీటిని, ORS, కొబ్బరి నీరు తాగడం శరీరాన్ని త్వరగా రికవరీ చేయడంలో సహాయపడుతుంది.
అల్లం, తేనె కలిగిన గోరువెచ్చని నీరు కూడా హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం జీర్ణవ్యవస్థను శాంతపరచి వికారం తగ్గిస్తుంది, తేనె రక్తంలో చక్కెర స్థాయిలను నిలిపి ఉంచుతుంది. కొబ్బరి నీరు హైడ్రేషన్‌తో పాటు శరీరానికి ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది, తలనొప్పి, అలసట తగ్గిస్తుంది మరియు యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి శరీరాన్ని రిఫ్రెష్ చేస్తాయి.
నిమ్మరసం కూడా హ్యాంగోవర్‌తో వచ్చే తలనొప్పి, ఆమ్లత, గ్యాస్ సమస్యలను తగ్గించి విటమిన్ C ను అందిస్తుంది, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డాక్టర్ల సూచన ప్రకారం,మద్యం సేవించిన తర్వాత ఈ సహజ పానీయాలను తీసుకోవడం శరీరాన్ని త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది.
గమనిక: మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.



.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!