

కివి పండు అనేది పోషకాలతో నిండి ఉండే సూపర్ ఫుడ్. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా శరీరానికి అవసరమైన విటమిన్-సి కివిలో అధికంగా లభిస్తుంది. గుజ్జులోని చిన్న నల్లటి విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి, ఇవి మొత్తం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. కివి రోగనిరోధక శక్తిని పెంచి, శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
కివి ఆస్తమా, అలర్జీ వంటి సమస్యలలో కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, జీర్ణక్రియకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులోని ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ మరియు డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. కివి పండు కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం. జియాజాంతిన్ మరియు లుటిన్ లాంటి కాంపౌండ్లు కంటి సమస్యలు, క్యాటరాక్ట్లను నివారించి, రేటినాను రక్షించడంలో సహాయపడతాయి.
చర్మానికి, బరువు తగ్గడానికి మరియు నిద్రకు కూడా కివి ప్రయోజనకరంగా ఉంటుంది. కొల్లాజెన్ సమృద్ధి, తక్కువ కేలరీలు, అధిక నీటినీ, ఫైబర్ వల్ల చర్మం తేజ్ పరుస్తుంది, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యలకు కూడా కివి పండు ఉపయోగపడుతుంది. ఐరన్ లోపం ఉన్నవారికి కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కివిని సలాడ్, జ్యూస్, స్మూతీ, స్నాక్‌గా తీసుకోవచ్చు. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, రోజువారీ ఆహారంలో కివిని చేర్చడం ఆరోగ్యకరమైన జీవనానికి సహాయపడుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!