

వైద్యులు మరియు పోషక నిపుణులు చెబుతున్నట్లుగా, ప్రెషర్ కుక్కర్ వంట ప్రస్తుత వేగవంతమైన జీవితంలో సమయాన్ని ఆదా చేసే ఒక ముఖ్యమైన పద్ధతి. తక్కువ నీరు, తక్కువ సమయంతో వండడం వల్ల విటమిన్ C, ఫోలేట్ వంటి కొన్ని సున్నితమైన విటమిన్లు కొంతవరకు మాత్రమే నశిస్తాయని, పూర్తిగా పోకుండా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే అధిక ఉష్ణోగ్రత, పీడనం కారణంగా కొన్ని పప్పులు, బీన్స్‌లోని పోషకాల్లో స్వల్ప మార్పులు రావచ్చని వారు సూచిస్తున్నారు.
కొన్ని పరిశోధనల ప్రకారం, బంగాళదుంపలు, బియ్యం వంటి పిండి పదార్థాలను ప్రెషర్ కుక్కర్లో అధిక వేడి వద్ద వండితే అక్రిలమైడ్ వంటి హానికర రసాయనాలు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పప్పుధాన్యాలల్లో ఉండే లెక్టిన్స్ పూర్తిగా నశించకపోతే కొంతమందికి జీర్ణ సమస్యలు, గట్ హెల్త్ సమస్యలు రావచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మంచి నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్లను ఉపయోగించడం, వంటలో జాగ్రత్తలు పాటించడం, అలాగే ప్రతిరోజూ కేవలం ప్రెషర్ కుక్కర్‌పై మాత్రమే ఆధారపడకుండా సంప్రదాయ వంట పద్ధతులను కూడా అనుసరించడం ఉత్తమం. సరైన రీతిలో ఉపయోగిస్తే ప్రెషర్ కుక్కర్ వంట ఆరోగ్యానికి పెద్దగా హానికరం కాదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక :మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!