

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం పప్పు అందరికీ అయితే అనుకూలం కాదు. ప్రోటీన్, విటమిన్ E, ఫైబర్, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నా, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఎవరు బాదం తినకూడదో చూద్దాం.
కిడ్నీ సమస్యలున్నవారు
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి బాదం ప్రమాదకరం. వీటిలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి రాళ్ల ఏర్పాటుకు దోహదం చేస్తాయి. ఇప్పటికే రాళ్లు ఉన్నవారిలో అసౌకర్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అధిక రక్తపోటుతో ఉన్నవారు
బాదంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హై బీపీ మందులు ప్రత్యేకంగా ACE ఇన్హిబిటర్లు లేదా పొటాషియం-స్పేరింగ్ మందులు వాడేవారికి ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీయొచ్చు. అందుకే వీరు పరిమితంగా తీసుకోవడం మంచిది.
జీర్ణ సమస్యలున్నవారు
IBS, అజీర్ణం, గట్ మోటిలిటీ తగ్గడం వంటి సమస్యలున్నవారికి బాదం జీర్ణం కావడం కష్టం. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల పొట్ట ఉబ్బరం, అసౌకర్యం పెరిగే అవకాశం ఉంటుంది.
యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నవారు
GERD లేదా ఆమ్లత్వం ఉన్నవారు బాదం ఎక్కువగా తింటే ఛాతీలో మంట, గ్యాస్, గొంతు అసౌకర్యం మరింత పెరగవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారు
బాదం ఆరోగ్యకరం అయినా కేలరీలు ఎక్కువ. కొద్దిగా తిన్నా కేలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలని లక్ష్యమున్నవారు పరిమితంగా తీసుకోవాలి.
NOTE:
ఇవి కేవలం అవగాహన కోసమే. మీ ఆరోగ్య సమస్యలను బట్టి మార్పులు ఉండొచ్చు. అనుమానాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!