
.png&w=3840&q=75)
ఒక్కో బ్లడ్ గ్రూప్ వారికి ఒక్కో రకమైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారట. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే, మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు కొన్ని బ్లడ్ గ్రూప్‌కి సరిపోవకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ గ్రూప్ ప్రకారం ఆహారం తీసుకోవడం చాలా మందికి తెలియదు. సాధారణంగా మనం అందరూ ఒకే రకమైన ఆహారం తింటూ ఉంటాం. కానీ, బ్లడ్ గ్రూప్‌ను బట్టి తినే ఆహారం శరీరానికి మరింత ఆరోగ్యకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
A బ్లడ్ గ్రూప్
తినాల్సిన ఆహారం: బ్లూబెర్రీలు, నేరేడు పండ్లు, చెర్రీలు, ద్రాక్ష, గుమ్మడి కాయ, క్యారెట్లు, బ్రోకోలి, గుడ్లు, సోంపు.
తక్కువగా తీసుకోవాల్సినవి: బీన్స్, వంకాయలు, టమాటాలు.
ప్రయోజనం: రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది.
B బ్లడ్ గ్రూప్
తినాల్సిన ఆహారం: బీట్ రూట్, ద్రాక్ష, పెరుగు, కాటేజ్ చీజ్, బాదం, మిరియాలు, వంకాయ, మటన్, కిడ్నీ బీన్స్, ఆవు పాలు.
తక్కువగా తీసుకోవాల్సినవి: చికెన్, మొక్క జొన్న, పప్పు ఉత్పత్తులు, సోయా ఉత్పత్తులు.
AB బ్లడ్ గ్రూప్
తినాల్సిన ఆహారం: రెడ్ వైన్, మటన్, గుడ్లు, పెరుగు, పాలు, పీనట్ బటర్, వెల్లుల్లి, అంజీర్, పప్పులు, ఆక్రోట్లు, కాలీఫ్లవర్, పుచ్చకాయ.
తక్కువగా తీసుకోవాల్సినవి: చికెన్, అరటి పండ్లు, మొక్క జొన్న.
O బ్లడ్ గ్రూప్
తినాల్సిన ఆహారం: చికెన్, మటన్, వెన్న, బాదం, అల్లం, ఉల్లిపాయలు, పాలకూర, ఆలివ్ ఆయిల్, అరటి పండ్లు, చేపలు, మామిడి.
తక్కువగా తీసుకోవాల్సినవి: కిడ్నీ బీన్స్, సోయాబీన్ ఆయిల్‌తో చేసిన ఆహారాలు, గోధుమ పిండితో చేసిన ఆహారాలు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!