

చాలా మందికి ఉదయం ఒక కప్పు వేడి టీ తాగితేనే రోజు ప్రారంభమవుతుంది. అలసట తగ్గించుకోవడానికి, హుషారుగా ఉండటానికి టీ రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే మిల్క్ టీ మంచిదా లేదా బ్లాక్ టీ మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
మిల్క్ టీలో పాలు, చక్కెర, టీ పొడి కలిపి ఉంటాయి. పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి అందించినా, అధిక చక్కెర, కొవ్వు కారణంగా బరువు పెరగే అవకాశం ఉంటుంది. ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. అంతేకాకుండా పాల వల్ల టీలోని యాంటీఆక్సిడెంట్ల ప్రభావం తగ్గుతుంది.
బ్లాక్ టీని పాలు, చక్కెర లేకుండా తయారు చేస్తారు కాబట్టి ఇది తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం మిల్క్ టీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా మధుమేహ రోగులు, బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఉపయోగకరమని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!