

వైద్యులు మరియు పోషకాహార నిపుణుల ప్రకారం, కాకరకాయ రసం ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాకరకాయలో ఉండే విటమిన్ C, విటమిన్ A, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్సిఫై చేసి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఇందులో ఉండే పీ-ఇన్సులిన్ శరీరంలో సహజ ఇన్సులిన్‌లా పనిచేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
నిపుణుల మాటల్లో చెప్పాలంటే, రోజూ కాకరకాయ రసం తాగడం వల్ల కాలేయం శుద్ధి అవుతుంది, ఫ్యాటీ లివర్ సమస్యలు తగ్గుతాయి. కడుపులోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోవడంతో గ్యాస్, బ్లోటింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ పానీయం. అంతేకాకుండా, రక్తం శుద్ధి కావడం ద్వారా చర్మ సమస్యలు, మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా కాకరకాయ రసం సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!