

నేటి కాలంలో పని ఒత్తిడి, వ్యక్తిగత చింతలు, కుటుంబ బాధ్యతలు, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ ఒత్తిడి వల్ల సంతోషకరమైన జీవితం గడపలేకపోవడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాహారాలను చేర్చుకుంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
డార్క్ చాక్లెట్ మితంగా తీసుకుంటే సంతోష హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది. అరటిపండ్లలోని విటమిన్ B6, పొటాషియం మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. బాదం, వాల్నట్స్లో ఉండే మెగ్నీషియం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెర్రీస్లోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి. చిలగడదుంపల్లో విటమిన్ C, పొటాషియం ఉంటాయని, గ్రీన్ టీలోని ఎల్-థియనిన్ మనసుకు విశ్రాంతినిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇవన్నీ సమతుల్యంగా తీసుకుంటే ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవితానికి దోహదపడతాయి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!