

నిద్ర సరిపోయినా ఉదయం అలసటగా ఉంటుందా? ఆరోగ్య నిపుణులు చెప్పినట్లు... మీరు లేచిన వెంటనే చేసే కొన్ని సాధారణ తప్పులు రోజంతా నీరసం, బరువు పెరగడానికి కారణమవుతాయి. స్మార్ట్‌ఫోన్ చూడటం, అల్పాహారం మానేయడం వంటి 5 అలవాట్లు మీ శక్తి స్థాయిలను, జీవక్రియను దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లను మార్చుకుంటే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
రాత్రి 7 - 8 గంటలు హాయిగా నిద్రపోయినా ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, నీరసం, రోజంతా బద్ధకం అనిపిస్తుందా? అయితే దానికి కారణం నిద్ర లేకపోవడం కాదు, మీరు నిద్రలేచిన వెంటనే చేసే కొన్ని ఉదయపు తప్పులే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన మొదటి అలవాట్లు రోజంతా శక్తి స్థాయిలను, మెటబాలిజంను నియంత్రిస్తాయి. ఈ రోజు నుండి మానుకోవాల్సిన ఆ 5 అలవాట్లు ఇవే.
నీరు తాగకపోవడం : రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు శరీరం సహజంగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగకపోతే మెటబాలిజం మందగిస్తుంది. ఇది నీరసానికే కాకుండా బరువు పెరగడానికి కూడా దారితీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో నీరు తాగితే టాక్సిన్స్ బయటకు పోయి శరీరం ఉత్తేజితమవుతుంది.
నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ చూడటం : చాలా మందికి కళ్లు తెరవగానే ఫోన్ చూడటం అలవాటు. ఇది మెదడుపై ఒత్తిడి పెంచి, స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ కారణంగా కార్టిసాల్ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుందని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రోజు బద్ధకంగా ప్రారంభమవుతుంది.
అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కి మళ్లీ నిద్రపోవడం : స్నూజ్ బటన్ నొక్కడం శరీర జీవగడియారాన్ని గందరగోళానికి గురిచేసి, స్లీప్ ఇనర్షియాను పెంచుతుందని పరిశోధనలు, స్లీప్ డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల రోజంతా మెదడు మబ్బుగా అనిపించి, మెటబాలిజం నెమ్మదించి బరువు పెరగవచ్చు.
అల్పాహారం మానేయడం : అల్పాహారం రోజుకు అవసరమైన ఇంధనం. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే శరీరం కొవ్వును నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తుంది. శక్తి స్థాయిలు పడిపోయి, ఏకాగ్రత దెబ్బతింటుందని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం : ఖాళీ కడుపుతో కెఫీన్ తీసుకోవడం అసిడిటీ పెంచి, జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది కొవ్వు కరిగే ప్రక్రియను అడ్డుకుంటుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చెబుతున్నారు. బదులుగా గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!