

ఒంట్లో సరైన స్థాయిలో హిమోగ్లోబిన్ (Hb) లేకపోతే రక్తహీనత (అనీమియా) సమస్య తలెత్తుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్తకణాలలో ఉండే ఐరన్ సమృద్ధిగా ఉన్న ప్రోటీన్, ఇది ఆక్సిజన్‌ను రక్తం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు తీసుకు వెళ్తుంది. అదే సమయంలో, కార్బన్‌డైయాక్సైడ్‌ను ఊపిరితిత్తులలోకి తిరిగి చేరుస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే రక్తహీనతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది తక్కువ హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్య కారణం సరైన పోషకాహారం తీసుకోకపోవడం. వైద్యులు హిమోగ్లోబిన్ పెంచడానికి అవసరమైన మందులు సూచిస్తారు.
అయితే, కొన్ని సాధారణ తప్పులు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. కొందరు వైద్యులను సంప్రదించకముందే సోషల్ మీడియా వీడియోలు చూసి, స్వయంగా ఆహారపు మార్పులు చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. వైద్యుల సలహా లేకుండా ఆహార అలవాట్లను మార్చడం ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఉదాహరణకు, వంటలో ఎక్కువ పసుపు ఉపయోగించడం హానికరం. ఇది శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తుంది. ఇప్పటికే రక్తహీనత లేదా తక్కువ హిమోగ్లోబిన్ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ పసుపు పాలు తాగడం మానుకోవాలి. పసుపు పాలు సాధారణంగా ఆరోగ్యానికి మంచివే, కానీ హిమోగ్లోబిన్ సంబంధిత సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది కరెక్ట్ కాకపోవచ్చు. అవగాహన లేకుండా దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి మరియు రోగనిరోధక శక్తిని కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!