

వైద్యులు చెబుతున్న ప్రకారం, బీట్రూట్ను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు గుండె, మెదడు, కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీట్రూట్లో ఉండే నైట్రేట్లు, బీటాలైన్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో గుండె పనితీరు బలపడటమే కాకుండా స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
అలాగే, బీట్రూట్కు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటంతో నొప్పులు, అలసట తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచి శక్తి, స్టామినాను మెరుగుపరుస్తుంది. బీట్రూట్ను సలాడ్‌గా, రసం రూపంలో లేదా స్మూతీల్లో తీసుకోవచ్చని, కరివేపాకు, క్యారెట్, ఆపిల్ వంటి వాటితో కలిపి జ్యూస్‌గా తాగితే మరింత ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించాలి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!