

మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కాంబినేషన్లో మరో భారీ యాక్షన్ సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేరు వీరయ్య గ్రాండ్ సక్సెస్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. KVN ప్రొడక్షన్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. మొదట హీరోయిన్గా మాళవిక మోహనన్ పేరు వినిపించినప్పటికీ, ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదనే టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట ఈ పాత్రకు తమిళ హీరో కార్తీని అనుకున్నారు అనే ప్రచారం జరిగినా, ఇప్పుడు మోహన్ లాల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా మోహన్ లాల్ నటిస్తే, ఇండస్ట్రీ మొత్తం షేక్ అవడం ఖాయమని అభిమానులు అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.









.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!